వాట్‌ లగా.. ‘లైగర్’ మాస్ సాంగ్ వచ్చేసింది !

“వి ఆర్‌ ఇండియన్స్‌. మేము ఎవరికీ తీసిపోం. సోదరి నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం” అంటున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన తొలి పాన్ ఇండియా సినిమా లైగర్. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్రబృందం.. తాజాగా సినిమాని సెకండ్ సాంగ్ ‘వాట్‌ లగా.. ‘ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషంపాటు సాగిన ఈ వీడియో సాంగ్‌లో విజయ్‌.. తన ప్రత్యర్థిపై పోరాటం చేస్తున్న దృశ్యాలు చూపించారు. పుల్ మాస్ గా ఉన్నాయి.

కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజయ్ ముంబయి మురికివాడకు చెందిన యువకుడిగా, ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన పాత్ర నత్తితో ఇబ్బందిపడే వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఆయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అనన్యా పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌ కీలకపాత్ర పోషించారు.ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.