సాగరకన్య ఫ్యాషన్
సాగరకన్య శిల్పాశెట్టి మరోసారి తన మార్క్ చూపించారు. శిల్పా శెట్టి వయసు 47. కానీ 17 ఏళ్ల హీరోయిన్ గా నాజూగ్గా ఉంటుంది. ఇప్పటికీ జీరో సైజ్ మెయింటైన్ చేస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడమే తన గ్లామర్ సీక్రెట్ అని శిల్పా పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా FDCI లాక్మే ఫ్యాషన్ వీక్-2022లో తళుక్కున మెరిసింది శిల్ప. స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. దాదాపు 14 ఏళ్ల తర్వాత శిల్పా శెట్టి వెండితెరపై సందడి చేసింది. హంగామా 2లో లో నటించింది. ఆ తర్వాత ‘నికమ్మా’ సినిమాలో సందడి చేసింది. హంగామా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రాగా.. నికమ్మా ఈ ఏడాది జూన్ లో రిలీజ్ అయింది. రెండు చిత్రాల్లో శిల్పా నటన ఆకట్టుకుంది. మరోవైపు టీవీ షో తో, కమర్షియల్ యాడ్స్ తో శిల్పా రాణిస్తున్నారు.