రెండో టీ20లో భారత్ ఓటమి.. కెప్టెన్ తప్పిదం ?
రెండో టీ20లో భారత్ పై విండీస్ విజయం సాధించింది. విండీస్ బౌలర్ మెకాయ్ (6/17) ధాటికి టీమ్ఇండియా 138 పరుగులకే ఆలౌటైంది. 138 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఆఖరి ఓవర్ లో చేధించి.. విక్టరీ సాధించింది. ఆఖరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ యువబౌలర్ అవేశ్ ఖాన్‌కు బంతినిచ్చాడు. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితుల్లో తొలి బంతిని అవేశ్ నోబాల్‌గా వేశాడు. తర్వాతి రెండు బంతుల్లో విండీస్ బ్యాటర్ థామస్ సిక్స్, ఫోర్ కొట్టేసి భారత్‌ను ఓడించాడు.
ఆఖరి ఓవర్లో అవేశ్ ఖాన్‌కు బదులు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (2-0-12-0)కు బౌలింగ్ ఇస్తే ఫలితం వేరేలా ఉండేదేమోనని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఈ నిర్ణయాన్ని రోహిత్ సమర్థించుకున్నారు. డెత్ ఓవర్లలో యువ బౌలర్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని భావించాం. కాస్త తడబాటుకు గురైనప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశారని రోహిత్ చెప్పుకొచ్చారు.