ప్రధాని మరో ఈవెంట్.. సోషల్ మీడియా డీపీ !
ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ఈవెంట్లు నిర్వహించడంలో ఎప్పుడూ హుషారుగా ఉంటారు. గతంలో చప్పట్లు కొట్టడం..లైట్లు ఆర్పేయడం.. క్యాండిల్స్ వెలిగించడం వంటివి చేసి చూపించారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు.
ఆగస్టు 2న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి. ఆయనకు నివాళిగా ఆగస్టు 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పిలుపుతో చాలా మంది సోషల్ మీడియా యూజర్లు తమ ఖాతాల ప్రొఫైల్ పిక్/డీపీలను మార్చుకుంటున్నారు. అయితే ఇదేమీ నిర్బంధం కాదు. కాకపోతే దీన్ని దేశభక్తికి కొలమానంలా చూసే చాన్స్ ఉంది. కచ్చితంగా యువత దేశభక్తిని చాటుకునే ఛాన్స్ ఉంది.