శోభిత దూళిపాళ్ల‌తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నాగ‌చైత‌న్య

హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌తో నాగ‌చైత‌న్య ప్రేమ‌లో ఉన్న‌ట్లు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సమంత-చైతన్య బ్రేకప్ కు ఇదే ప్రధాన కారణమని వాదించేవారు ఉన్నారు. ‘మేజ‌ర్’ సినిమా రిలీజ్ టైమ్ లో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన శోభితను చైతూ ప‌లుమార్లు క‌లిసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ డేటింగ్ రూమ‌ర్స్‌పై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాగ‌చైత‌న్య తాజాగా స్పందించారు. ఆమీర్ ఖాన్ తో కలిసి చైతూ నటించిన ‘లాల్‌సిండ్‌చ‌డ్డా’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతూ పాల్గొన్న ఓ ఇంట‌ర్వ్యూలో శోభిత పేరు విన‌గానే మీకుగుర్తొచ్చేది ఏది అంటూ అడిగిన ప్ర‌శ్న కు చిరున‌వ్వు అంటూ ఫ‌న్నీగా ఆన్స‌ర్ చెప్పాడు. ఆ పేరు విన‌గానే త‌న పెదాల‌పై న‌వ్వు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంద‌ని, అంత‌కుమించి మరేం గుర్తురాదంటూ పేర్కొన్నాడు. చైతూ స‌మాధానం వెనుక ఉన్న ఆంత‌ర్య‌మేమిట‌న్న‌ది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.