ముగ్గురు స్టార్ హీరోయిన్లతో కుర్ర హీరో !

 

ప్రియాంక చోప్రా – అలియా భట్ – కత్రినా కైఫ్ లతో కలిసి ఓ రోడ్ ట్రిప్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు ఫరాన్ అక్తర్. అదే Jee Le Zaraa (జీ లే జరా). గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రకటన వచ్చింది. అయితే ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. దీనికి గల కారణాలపై ఆరా తీస్తే.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రియాంక, కత్రినా, అలియా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ముగ్గురి డేట్స్ ఒకేసారి  దొరకడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది జులై/ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు తెలిసింది. తాజాగా ఈ సినిమా గురించి మరో బిగ్ అప్ డేట్ వచ్చింది. యంగ్ హీరో ఇషాన్ కట్టర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఈ సినిమాలో ఇషాన్  ఖట్టర్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.