ఇదీ.. కేసీఆర్ తెలంగాణ !

హైదరాబాద్‌లో నిర్మితమైన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.  ఏడెకరాల విస్తీర్ణం.. నాలుగు టవర్లు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మితమైంది. ఈ సందర్భంగా ఇదీ.. కేసీఆర్ తెలంగాణ అంటూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంతీ పాటు.. టీ-హబ్, యాదాద్రి, ఫై ఓవర్స్ … ఇలా అన్ని ఫోటోలను మంత్రి జత చేశారు. తెలంగాణలో తాము చేసిన అభివృద్ధి అంటూ గర్వంగా చెప్పుకున్నారు. అయితే టెక్నాలజీలో తెలంగాణ దూసుకెళ్తోంది. కానీ మీరు ఇచ్చిన హామీలు ఎటు పోయినవి. ఉద్యోగాల సంగతి ఏమైంది ? గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి ఏంటీ ? అంటూ.. ఇలా కొన్ని మైనస్సులు వెతికి వెలికి తీసే పనిలో టీఆర్ ఎస్ అపొజిషిన్ కార్యకర్తలు ఉన్నారు.