ముఖ్యమంత్రిని చూసిన కుప్పంకు మంత్రిని ఇస్తారట !

వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ టార్గెట్ 175 సీట్లు. క్లీన్ స్వీప్ అన్నమాట. అయితే అది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి మొదలు కావాలని జగన్ ఆశపడుతున్నారు. ఇందుకోసం గట్టి ప్రణాఌకలు కూడా రచిస్తున్నారు. గురువారం కుప్పం నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశమైన జగన్‌.. వివిధ అంశాలపై వారికి సూచనలు చేశారు. కుప్పం తన సొంత నియోజకవర్గం లాంటిదని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

కుప్పం నియోజవర్గం ముఖ్యమంత్రిని చూసింది. చంద్రబాబు సొంత నియోజవర్గంగా ఘన కీర్తిని అనుభవించింది. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం నిల్. అక్కడి ప్రజల కోసం బస్సులు కట్టి హైదరాబాద్ కు తీసుకొచ్చి.. భాగ్యనగరం అంతా తిప్పి. రామోజీ ఫిల్మ్ సిటీని చూపించి.. వారి కోసం ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని మాత్రం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అదే ఏపీ సీఎం జగన్ ను ఆయుద్ధంగా మారింది. ఒకప్పుడు సైకిల్ గుర్తు తప్ప తెలియని కుప్పం ప్రజలు.. ఇప్పుడు ఫ్యాన్ గాలి కింది స్వచ్ఛంధంగా వస్తున్న పరిస్థితి. జగన్ చెప్పినట్టు 175 సీట్లు సాధిస్తాడో లేదో తెలియదు. కానీ కుప్పంలో మాత్రం వైకాపా గెలిచే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.