భారత్ ‘వర్సెస్’ పాక్.. 15 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్ లు

భారత్ – పాక్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఆసియా కప్‌ పుణ్యమా అని 15 రోజుల వ్యవధిలో భారత్‌, పాక్‌ మూడు సార్లు పోటీపడే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. భారత్‌ డిఫెడింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, గత ఏడాది భారత్‌ను టీ 20 ప్రపంచకప్‌లో ఓడించామన్న ఉత్సాహంతో పాక్‌ ఆసియా కప్‌కు సిద్ధం అవుతోంది.

ఈ నెల 28న  దుబాయ్‌ వేదికగా పాక్‌తో, ఆ తర్వాత 31న క్వాలిఫయర్‌ జట్టుతో టీమ్‌ఇండియా తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి నెగ్గినా భారత్‌ సూపర్‌ 4కు అర్హత సాధిస్తుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో తలపడతాయి. గ్రూప్‌ ఏలో భారత్‌, పాక్‌లు కొత్తజట్టుపై గెలవడం దాదాపు ఖాయం. దీంతో ఈ రెండు జట్లే సూపర్‌ 4లో మరోసారి ఆడే అవకాశం ఉంది.