వారితో కష్టం.. ఎన్టీఆర్‌తో ఇష్టం
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంటోంది జాన్వీ కపూర్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. బాలీవుడ్, టాలీవుడ్ కు సంబంధించి ఆసక్తికర ఆన్సర్స్ చెప్పింది. ‘షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ వీరిలో ఎవరితో నటించడానికి మీరు ఇష్టపడతారు? అని అడిగిన ప్రశ్నకు… జాన్వీ ‘వాళ్లంతా సీనియర్ నటులు. వారికి, నాకు వయస్సులో చాలా తేడా ఉంది. అలాంటి జంటలను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఒప్పుకోరు. కెమిస్ట్రీ కూడా కుదరదని చెప్పుకొచ్చింది.
ఇక ‘మీ డ్రీమ్ హీరో ఎవరు?’అని అడిగిన ప్రశ్నకు ‘తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం నా డ్రీమ్ అని బదులిచ్చింది. ఇంకా బాలీవుడ్‌లో రణ్‌బీర్‌కపూర్, వరుణ్‌దావన్ లతో నటించాలనే కోరిక ఉందంటూ చెప్పుకొచ్చింది. జాన్వీ లేటెస్ట్ మూవీ ‘గుడ్‌లక్ జెర్రీ’ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీ నటిస్తున్న ‘మిలి’, ‘మిస్టర్ అండ్ మిస్ట్రెస్ మహి, బవాల్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.