బ్రదర్స్ విడిపోలేదు

అన్న వెనుక తమ్ముడు పోతడు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో తమ్ముడు వెనుక అన్న వెళ్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. తమ్ముడు పార్టీని వీడిన వేళ ఆ సెగ అన్నకు కూడా తగిలింది. కాంగ్రెస్ పార్టీ లేకుంటే బ్రదర్స్ బ్రాందీ షాపులో పని చేయడానికి కూడా పనికిరాపోయే వాళ్లు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకు పడిన సంగతి తెలిసిందే.

దీనిపై వెంకట్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. అనవసరంగా నన్ను గెలక్కు.. బాగుండదని హెచ్చరించారు. అదే సమయంలో తమ్ముడు పార్టీ మార్పుపై నో కామెంట్స్ అంటూ దాటవేశారు. అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లో లేరా ? పార్టీ మారడం రాజగోపాల్ రెడ్డి ఇష్టం అన్నట్టుగా వెంకట్ రెడ్డి స్పందించారు. అయినా.. రేవంత్ కాకపోయినా.. ఇతర నేతలు వెంకట్ రెడ్డిపైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇంతలో వెంకట్ రెడ్డి ఢిల్లీలో కేంద్రం హోంశాఖ మంత్రి అమితా షాతో భేటీ అయి.. తాను కూడా కమలం తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ఇండికేషన్స్ ఇచ్చారు. ఇది చూసిన నల్గొండ ప్రజలు అరె.. బ్రదర్స్ విడిపోవడం లేదు. వాళ్లిద్దరూ ఒక్కటే అని చెప్పుకుంటున్నారు.