‘బింబిసార 2’ కూడా ఉంది

నందమూరి కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీని మురిపించారు. ఆయన కథానాయకుడిగా వశిష్ట్ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలిరోజు పాజిటివ్ టాక్ రావడంతో.. ప్రేక్షకులు థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రమే సినిమా హిట్ అని క్లారిటీ రావడంతో దర్శకుడు వశిష్ట్ తో కలిసి కళ్యాణ్ రామ్ సెలబ్రేషన్స్ షురూ చేశారు. మీడియా ముఖంగా కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కల్యాణ్ రామ్.. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులకు థియేటర్లకు భారీగా తరలి వస్తారని ఈ సినిమా నిజం చేసింది. చిత్ర పరిశ్రమ వారికి జీవితాతం పూర్తిగా రుణపడి ఉంటుంది. తొలి ప్రేక్షకుడిగా ఈ సినిమాను చూసిన నా తమ్ముడు ఎన్టీఆర్ మాకు ఎంతో మద్దతుగా నిలిచాడు. లవ్ యూ నాన్నా. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. వారందరికీ నా కృతజ్ఞతలు. నన్ను నాకంటే ఎక్కువగా నమ్మి బింబిసార కథను ఇచ్చినందుకు దర్శకుడు వశిష్ఠకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విజయానందంతో బింబిసార 2 మరింత బాధ్యతతో తీస్తామని ప్రకటించారు.