బేబీ బంప్ తో అలియా భట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు అలియా-రణ్ బీర్ దంపతులు. ఈ ఏడాది ఏప్రిల్ 14న అలియా-రణ్ బీర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే మూడ్నెళ్లు కూడా తిరగక్కుండా ఈ జంట గుడ్ న్యూస్ చెప్పింది. తల్లి కాబోతున్న అలియా.. రెస్ట్ తీసుకోవడం లేదు. వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొని వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో మెరిసింది.

మొన్నటి వరకు  ‘డార్లింగ్స్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నిన్న డార్లింగ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డార్లింగ్స్ రిలీజైన వెంటనే మళ్లీ బ్రహ్మాస్త ప్రమోషన్స్ షురూ చేసింది అలియా. శనివారం భర్త రణ్ బీర్ కపూర్ తో కలిసి ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ధరించిన టైట్ డ్రెస్ తో ఆమె బేబీ బంప్ కనిపిస్తోంది. వాస్తవానికి ఇన్నాళ్లు వదులు దుస్తులు ధరించి బేబీ బంప్ కనబడకుండా అలియా కవర్ చేసింది. ఫస్ట్ టైమ్ బేబీ బంప్ కనిపించేలా కెమెరా ముందుకు వచ్చింది.