సమంత, చైతూ.. ప్రేమలో ఎంత తేడా ?
ఆడదాని మనసు ఒక్కసారి విరిగితే అతుక్కోదు అంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అదే జరిగినట్లు ఉంది. సమంత-నాగ చైతన్య భార్యభర్తలు విడిపోయి.. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. అయితే జీవితంలో మళ్లీ ప్రేమలో పడే ప్రసక్తే లేదని సామ్ తేల్చి చెప్పేసింది. అయితే చైతూ మాత్రం అందుకు భిన్నంగా.. మళ్లీ ప్రేమలో పడతా. పెళ్లి చేసుకుంటా. జీవితాన్ని ఆనందమయం చేసుకుంటా అంటున్నాడు.
ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొంది సమంత. ఈ సందర్భంగా నాగ చైతన్యతో బ్రేకప్ ఇష్యూ ప్రస్తావనకు వచ్చింది. బ్రేకప్ అంత ఈజీగా జరగలేదు. మేం సంతోషంగా లేము. ఒకవేళ ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే.. అక్కడ మారణ ఆయుధాలు ఉండకుంటే బెటర్ అని చెప్పుకొచ్చింది. ఇక మళ్లీ ప్రేమలో పడతారా అంటే ? లేదు మరోసారి ప్రేమలో పడనని ఖరాఖండిగా చెప్పేసింది. ఇక ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోన్న నాగ చైతన్య.. తాజాగా మరోసారి సామ్‌తో విడాకులు తీసుకోవడంపై స్పందించారు. పరస్పర అంగీకారంతోనే మేమిద్దరం విడిపోయాం. విడిపోయి ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుంటున్నాం అన్నారు.
మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం ఉందా ? అని అడిగితే.. “తప్పకుండా పడతాను. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరగనుందో. మనిషి జీవించడానికి ఊపిరి ఎంతో అవసరమో.. ప్రేమ కూడా అంతే అవసరం. మనం ప్రేమించాలి. ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి. అలా జరిగితేనే ఎప్పటికీ ఆరోగ్యంగా, పాజిటివ్‌గా ఉండగలుగుతాం” అని చెప్పుకొచ్చారు. చైతూ ఆల్రెడీ లవ్ లో ఉన్నాడని.. హీరోయిన్ శోభితా ధూళిపాళతో ఆయన డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.