తెలంగాణ టీడీపీ.. బీజేపీలో విలీనం ?
తెలంగాణలో అధికారంలో రావడమే ధ్యేయంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీతో దోస్తానాకు చేతులు చాపుతున్నది. ఆదివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అద్భుతమైన ఆదరణ, ఆప్యాయత లభించడం వెనక ఇదే కారణం అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ గత చరిత్ర ఘనం. ప్రస్తుతం మాత్రం ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. తెలంగాణలో పత్తా లేకుండా పోయింది. అయితే ఇప్పటికీ తెలంగాణలోని మారుమూల గ్రామాల్లోనూ ఎన్ టీఆర్ అభిమానులు ఉన్నారు. పచ్చ పార్టీ ప్రేమికులు ఉన్నారు. పట్టణాల్లో తప్ప గ్రామాల్లో బలంగా లేని కమలం పార్టీ సైకిల్ తో కలిసి సవారీ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. బాబు ఓకే అంటే.. ఆయనతో కలిసి జనసేన కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో బాబు పతార మరోసారి పెరుగుతోంది.
తెలంగాణ టీడీపీ సైతం ఇది మంచి అవకాశంగా భావిస్తోంది. అసలు సృహాలోనే లేని పార్టీకి రేపు అధికారంలోకి రాబోతుంది అనే ప్రచారం జరుగుతున్న తెలంగాణ బీజేపీ చేతులు కలుపుతాననడం మంచి పరిణాణమమే. అయితే ఇది పొత్తు కాదు. ఒక విధంగా చూస్తే ఇది విలీనం. బీజేపీలో తెలంగాణ టీడీపీ విలీనం అన్నమాట. ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు బీజేపీకి మద్దతు ఇస్తారు. టీడీపీ తరుపున స్పెషల్ గా పోటీ చేయరు. కమలం గుర్తు మీదనే సైకిల్ క్యాండిడేట్స్ పోటికి దిగుతారు అన్నమాట. మరీ.. ఇదే ఫార్ములాకు జనసేన అంగీకరించకపోవచ్చు. మొత్తానికి ప్రస్తుతానికి బీజేపీ+టీడీపీ+జనసేన+కొని ప్రశ్నించే గొంతుకలు కలిసి పని చేయాలనే చర్చలు మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అవి ఫలిస్తే.. టీఆర్ ఎస్ ను ఢీ కొనడంలో కాంగ్రెస్ కంటే ముందు బీజేపీలో ఉన్నట్టే. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు మెరుగు పడినట్టే.