‘సామ్ బహదూర్’గా విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్

మేఘన గుల్జార్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న సినిమా “శ్యామ్‌ బహదూర్‌” .ఫాతిమా సనా షాయ్ సన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. రోనీ స్క్రూవాలా నిర్మాత. సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్ షురూ అయింది. సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షా.

1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యాడు. మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ఆయన్ని ‘శ్యామ్‌ బహదూర్‌’ అని పిలుచుకుంటారు. ఇప్పుడు ఇదే పేరుతో.. ఈ భారత వీరుడి బయోపిక్ తెరకెక్కుతోంది. సామ్ బహదూర్ గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో మార్షల్‌ మానెక్‌షా పాత్రలో ఒదిగిపోయారు.