‘అరవింద సమేత’ అభిమానుల తలకెక్కింది.. !

ఇది నిజమే.. ! ‘అరవింద సమేత’ని అభిమానులు తలకెక్కించుకొన్నారు. దాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు కూడా. ఇప్పుడది వైరల్ గా మారింది. తారక్-త్రివిక్రమ్ ‘అరవింద సమేత’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ. 80కోట్లు పలికినట్టు తెలిసింది. మాస్-యాక్షన్ తారక్ కు కొండినపిండి. తారక్ దారిలోకి వచ్చి మరీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో కథని ఎంచుకొన్నాడు. సినిమాలో యాక్షన్ హైలైట్ గా ఉండేలా చూసుకొంటున్నాడు. దాంతోపాటు.. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండనున్నాయి.

ఇప్పటికే రషెస్ చూసిన కొందరు సినిమా అదిరిపోయిందని చెప్పారట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు అభిమానులతో పంచుకొన్నారు. ఇంతటి పాజిటివ్ టాక్ విని తారక్ అభిమానుల ఆనందానికి అవద్దుల్లేకుండా పోయాయి. ‘అరవింద సమేత’ క్రేజ్ తలకెక్కించుకొంటున్నారు. ఓ కుర్రాడు తన హెయిర్ కటింగ్ లో ‘అరవింద సమేత’ టైటిల్ తో కట్ చేయించుకొన్నారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఇది చూసిన మిగితా హీరోల అభిమానులు.. అరవింద సమేతని తారక్ అభిమానులు తలకెక్కించుకొంటున్నారని సరదాగా స్పందిస్తున్నారు. మరీ.. సినిమా రిలీజ్ తర్వాత కాలరెగరేస్తారమో చూడాలి.