బిగ్ బాస్ సీజన్-6 సందడి షురూ

బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ కు రంగం సిద్ధమైంది. త్వరలోనే మా టీవీలో ప్రసారం కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ప్రోమోను విడుదల చేశారు నాగార్జున. ‘లైఫ్‌లో ఏదైనా బిగ్‌బాస్‌ తర్వాతే. బిగ్‌బాస్‌ సీజన్‌ 6.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌’ అంటూ నాగార్జున తనదైన శైలిలో చెప్పి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లోనూ (Disney+ Hotstar) స్ట్రీమింగ్‌ కానుంది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ -1 కు యంగ్ టైగర్ ఎన్ టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. రెండో సీజన్ ని నాని  డీల్ చేశారు. ఇక గత మూడు సీజన్ల (3,4,5)కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు. టీవీలో ప్రసారమైన ఈ కార్యక్రమంతోపాటు ‘ఓటీటీ బిగ్‌బాస్‌’కీ ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొన్నారో త్వరలోనే తెలియనుంది.