సల్మాన్ ఖాన్ ఈజ్ బ్యాక్

 బాలీవుడ్  కండల వీరుడు సల్మాన్ జిమ్ వీడియో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏడాది మొత్తం సిక్స్ ప్యాక్ తో కనిపించే ఏకైక హీరో సల్మాన్ ఖాన్ అన్న విషయం తెలిసిందే. గతంలో సల్మాన్ జిమ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే వారు. యువతకు ఆదర్శంగా నిలిచే వారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు జిమ్ వీడియోలు షేర్ చేస్తుండటంతో.. సల్మాన్ ఆ పని కి పులిస్టాప్ పెట్టారు.అయితే చాన్నాళ్ల తర్వాత సల్మాన్ నుంచి ఓ జిమ్ పిక్ వచ్చింది.

మరోవైపు సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం జరుగుతున్న పంజాబీ బ్యూటీ షెహనాజ్ గిల్  ‘కభీ ఈద్ కభీ దీపావళి’ లో నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చింద్మి.  షెహనాజ్ గిల్ మ్యూజిక్ వీడియోస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. బోలేడు వీడియోలు చేసింది. ఏడాదిలో ఇరవైకి పైనే ఆమె మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి. ఇక బిగ్ బాస్ సీజన్-13 తో షెహనాజ్ మరింత పాపులర్ అయింది. అదే సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు దగ్గరైంది. వీరిద్దరి మధ్య ఏదో సాగుతుందనే ప్రచారం బాలీవుడ్ లో జోరుగా జరుగుతుంది.

ఈ క్రమంలో సల్మాన్ ‘కభీ ఈద్ కభీ దీపావళి’ సినిమాలో ఛాన్స్ కొటేసింది. అయితే ఈ సినిమా నుంచి గిల్ తప్పుకుందని అనే ప్రచారం ఇటీవల ఎక్కువైంది. తాజాగా దీనిపై స్పందించిన బ్యూటీ.. అవన్నీ రూమర్లే అని కొట్టిపారేసింది. ఈ సినిమాలో సల్మాన్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. మరో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకుడు.