సమంత లేదు. ఆమె జరిగిన పెళ్లి డేట్ ఎందుకో.. ?
నాగ చైతన్య మణికట్టుపై ఓ పచ్చ బొట్టు ఉంటుంది. ఆయన అభిమానులు కూడా అదే ఫాలో అవుతున్నారు. అక్కడే పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. దీనిపై ఫ్యాన్స్ ను అలర్ట్ చేశారు చైతూ. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి స్పందించారు. ‘‘మీ చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏమిటి? దానిని ఎందుకు వేయించుకున్నారు?’’ అని ప్రశ్నించగా… అదంటే నాకెంతో ఇష్టం. సామ్‌తో పెళ్లి జరిగిన తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్నా. చూసేవారికి అది డేట్ అనే విషయం తెలియదు. దాంతో నా అభిమానులు చాలామంది ఆ పచ్చబొట్టుని కాపీ కొడుతున్నారు.
ఇటీవల నేను పలువురు అభిమానుల్ని కలిశా. వారిలో కొంతమంది నా చేతిపై ఉన్న పచ్చబొట్టునే కాపీ కొట్టి వేయించుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నా అభిమానులందరికీ చెప్పేది ఒక్కటే.. దయచేసి టాటూ విషయంలో నన్ను ఫాలో కాకండి. ఎందుకంటే అది నా మ్యారేజ్ డేట్ అని చెప్పుకొచ్చారు. అయితే సమంతనే వదిలేశారు. ఆమెతో జరిగిన పెళ్లి డేట్ తో వేయించుకున్న పచ్చ బొట్టు ఎందుకు ? తీసేయండని సమంత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.