‘ఫారెస్ట్‌ గంప్‌’ కంటే ‘లాల్ సింగ్ చడ్డా’ బాగుంది

ఆమీర్ ఖాన్ సినిమా వస్తుందంటే.. ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి. ఎందుకంటే.. ? కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్. కథ-కథనం.. అందులో అమీర్ నటన  అద్భుతంగా ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌ రీమేక్‌ లాల్ సింగ్‌ చడ్డాతో రేపే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా రివ్యూలు అప్పుడే వచ్చేశాయి. చెన్నైలో ఈ స్పెషల్‌ స్క్రీనింగ్ కు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా చూసిన తర్వాత గొప్పగా రివ్యూలు ఇచ్చారు.

ఒరిజినల్‌ ఫారెస్ట్‌ గంప్‌ కంటే కూడా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ బాగుందని రివ్యూ ఇచ్చారు. టాలీవుడ్‌ నటి రెజీనా చెన్నైలో ఈ మూవీ స్పెషల్‌ స్క్రీనింగ్‌కు వెళ్లింది. “చాలా బాగా నచ్చింది. అద్భుతంగా చేశారు. వయాకామ్‌కు శుభాకాంక్షలు. ఆమిర్‌ ఖాన్‌ సర్‌ తనలోని బెస్ట్‌ చూపించాడు. కరీనా కపూర్‌ మేడమ్‌, మోనా, నాగ చైతన్యలు కూడా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. సినిమా ముగిసే సమయానికి కన్నీళ్లు వచ్చాయి. మొత్తం టీమ్‌కు ఆల్‌ ద వెరీ బెస్ట్‌ అని రెజీనా చెప్పింది.