అతడెప్పటికీ నా వాడే
వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీతో నటి పూర్ణ నిశ్చితార్థం ఈ ఏడాది జూన్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
అయితే.. నిశ్చితార్థమైన తర్వాత పూర్ణ, ఆమెకు కాబోయే భర్త షనీద్ మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో వీరు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారంపై పూర్ణ స్పందించింది. కాబోయే భర్తని కౌగిలించుకుని సిగ్గుపడుతోన్న ఓ ఫొటోని ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘అతడెప్పటికీ నా వాడే’’ అంటూ లవ్ సింబల్స్‌ను జోడించారు. సింగిల్ ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం నటిగా బిజీగా లేకపోయినా.. పలు టీవీ షోస్ చేస్తోంది పూర్ణ.