ఫుల్ మూడ్ లో మానుషి

మిస్ వరల్డ్ కిరీటం తెచ్చిపెట్టిన ఆరో భారత అందం మానుషి చిల్లర్. 2017లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది. ఈ ముద్దుగుమ్మ ‘పృథ్వీరాజ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పృథ్వీరాజ్’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే రాణి సంయోగితగా మానుషి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక చిల్లర్ నటిస్తున్న రెండో సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది. చిల్లర్ నటిస్తున్న మూడో సినిమా టెహ్రాన్ ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో జాన్ అబ్రహం-మానుషి చిల్లర్ జంటగా ‘టెహ్రాన్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదో యాక్షన్ థ్రిల్లర్. ఫస్ట్ లుక్ లోనే చిల్లర్ యాక్షన్ లోకి దిగిపోయింది. బేబీ కటింగ్ తో గన్ చేతిలో పట్టుకొని జాన్ తో కలిసి ఫైటింగ్ చేస్తూ కనిపించింది. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ గా ఫోటో షూట్స్ చేస్తోంది చిల్లర్. తాజాగా బ్లూ కలర్ లాగు.. పైన వైట్ టీ షర్ట్ లో కెమెరా ముందు పోజులు కొట్టింది. వాటిన తన ట్విట్టర్ ఖాతా షేర్ చేస్తూ..  White & light అనే కామెంట్ పెట్టింది. ఫోటోలతో పాటు వీడియోను పంచుకుంది. ఇవి చూసిన నెటిజన్లు మానుషి చిల్లర్ మస్త్ మూడ్ లో కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. 

White & light 💡 pic.twitter.com/Ed6k30J8e7— Manushi Chhillar (@ManushiChhillar) August 10, 2022