ముదురు ముద్దుగుమ్మ బజార్ పోజులు

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ రెచ్చిపోతుంది హుమా ఖురేషి. ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు. ఈ వయసులోనూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. యంగ్ హీరోయిన్స్ కు పోటీ అంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీల కోసం అందాలు ఆరబోస్తోంది.

తాజాగా  Harper’s #Bazaarmagazine మేగజైన్ కోసం రెచ్చిపోయింది. బ్లాక్ & వైట్ డ్రెస్సులో పోజులు కొట్టింది. వాటిని ఒకేసారి రిలీజ్ చేయకుండా.. రోజుకోకటి షేర్ చేస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది బెల్ బాటమ్ సినిమాతో పాటు మహారాణి వెబ్ సిరీస్ లో నటించింది. అంతేకాదు.. ‘Army of the Dead’ అమెరికన్ సినిమాలోనూ మెరిసింది. ఆమె నటించిన తమిళ సినిమా ‘వాలిమై’ రిలీజ్ కి రెడీగా ఉంది. నెట్ ఫ్లిక్స్ కోసం తెరకెక్కుతున్న “మౌనిక, ఓ మై డార్లింగ్” షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ‘డబుల్ ఎక్సల్’ షూటింగ్ పూర్తి చేసుకుంది.