‘జైలర్’లో నరసింహా-నీలాంబరి.. రీపీట్ !

నరసింహా-నీలాంబరి పాత్రల్లో నటించిన  రజనీకాంత్‌, రమ్యకృష్ణ మరోసారి ఒకే చిత్రంలో కనువిందు చేయనున్నారు. ‘జైలర్‌’ చిత్రం కోసం మళ్లీ కలువనున్నారు. దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బుధవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో షురూ అయింది. 15 లేదా 22 నుంచి రజనీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

అదే రోజు రమ్యకృష్ణ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తొంది. వీరిద్దరు పాత్రలో జైలర్ లోనూ నరసింహా-నీలాంబరి తరహా పోటా పోటీగా ఉంటాయట. ఈ నేపథ్యంలో నరసింహా సినిమాలోని పోస్టర్లు, డైలాగ్స్ ను రజనీ ఫ్యాన్స్ మరోసారి వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.