ఆస్కార్ రేసులో ఎన్టీఆర్
తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లోని ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమాతోనే అలియాభట్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మార్చి 25న రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఆర్ ఆర్ ఆర్ ఓటీటీలో రిలీజైన తర్వాత ప్రపంచం వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
రాజమౌళి ఓకే అంటే.. ఆయన సినిమాను నిర్మిస్తామని రస్సో బ్రదర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఆర్ ఆర్ ఆర్ సినిమా, రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటనపై ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్వితీయ అభినయాన్ని కనబరచిన ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో నామినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ఓ కథనాన్ని రాసింది.
హాలీవుడ్ స్టార్స్ నికోలస్ కేజ్, ఇరానియన్ యాక్టర్ మెహదీ బజేస్థానీ, నికోలస్ హాల్ట్, ఓవెన్ టీగ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉత్తమ నటుడి కేటగిరీలో పోటీ పడవచ్చునని పేర్కొన్నది. బెస్ట్ యాక్టర్ తో పాటు ఉత్తమ సినిమా, , బెస్ట్ డైరెక్టర్, ఒరిజినల్ స్క్రీన్ప్లే విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఎంట్రీలను దక్కించుకోవచ్చని పేర్కొన్నది. మొత్తానికి.. ఏదో ఒక్క కేటగిరిలోనైనా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.