తెలుగు, తమిళ్ లోనూ ‘డార్లింగ్స్‌’

జస్మీత్‌ రీన్‌ దర్శకత్వంలో అలియా భట్‌ ప్రధాన తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘డార్లింగ్స్‌’. విజయ్‌ వర్మ, షెఫాలీ షా కీలక పాత్రలు పోషించారు. షారూక్‌ఖాన్‌ రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థతో కలిసి అలియా సొంతంగా నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డార్లింగ్స్ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ కామెడీ డ్రామాని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. మందుగా తెలుగు, తమిళ నేటివిటీకి అనుగుణంగా కొద్దిమార్పులు చేసి ఆ భాషల్లో రీమేక్‌ చేయాలనుకుంటున్నాం అంటూ రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఓఓ గౌరవ్‌ వర్మ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.