రాసిపెట్టుకోండి.. 2023 ప్రభాస్ దే ! ఏకంగా 3 సినిమాలు రిలీజ్ !

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సలార్’. పంద్రాగస్టు కానుకగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ దాదాపు ఫిక్సయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ రిలీజ్ కానుంది.

మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది అక్టోబర్ లేదా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని నిర్మాత అశ్వినీ దత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ లెక్కన వచ్చే ఏడాది ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రాజెక్ట్ కె రాకపోయినా.. సలార్ , ఆదిపురుష్ రిలీజ్ ఖాయమని చెప్పవచ్చు.