వైట్ & వైట్ లో రెచ్చిపోయిన హాట్ షో

మొదట్లో గ్లామర్ తో ఆకట్టుకుంది రాశీఖన్నా. వరుసగా గ్లామర్ రోల్స్ లో నటించింది. అయితే తొలిప్రేమతో తనలోని అసలు సిసలు టాలెంట్ ని బయటకు తీసింది. అప్పటి నుంచి అటు గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది రాశీఖన్నా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తుంది.

ఇందులో నాలుగు తమిళ సినిమాలు, రెండు తెలుగు,  ఓ హిందీ సినిమా ఉంది. మరో రెండు బాలీవుడ్ వెబ్ సిరీస్ ల్లో నటిస్తుంది. ఇంతటీ బిజీలో అభిమానుల కోసం స్పెషల్ ఫోటో షూట్స్ చేస్తోంది. గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. లెటెస్ట్ గా వైట్ & వైట్ లో రెచ్చిపోయింది. క్లీవేజ్ షో చేసింది. కూర్చొని, నిల్చొని ఒయలు తిరుగుతూ అందాల విందు ఇచ్చింది. రాశీ లెటేస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.