బిగ్ బాస్ 6 ముహూర్తం ఫిక్స్

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆరో సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ప్రారంభం కాబోయే తేదీని హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ పాపులర్‌ రియాల్టీ షో సెప్టెంబర్‌ 4 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఓ ప్రోమో ద్వారా హాట్‌స్టార్‌ ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌ చేసింది.

ఎప్పటిలాగే సెలబ్రిటీలతోపాటు కామన్‌మెన్‌కు కూడా హౌజ్‌లో చోటివ్వనున్నారు. ఉదయభాను, శ్రీహాన్‌, నేహాలాంటి వాళ్లు ఈసారి హౌజ్‌లోకి రానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే షో ప్రారంభం అయ్యే వరకు కంటెస్టెంట్స్ డిటేల్స్ బయటకు రాకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

The new season of BIGG BOSS is here! #BBLiveOnHotstar from September 4th, entertainment ki adda fix…#DisneyPlusHotstar #BiggBossTelugu6 pic.twitter.com/MMh3hRAx1Y— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 19, 2022