టాలీవుడ్‌లో మరో విషాదం.. రాజేంద్ర ప్రసాద్ కన్నుమూత !

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శక-నిర్మాత రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ‘నిరంతరం’ అనే సినిమాకు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు నిర్మాత, రచయితగా కూడా ఆయనే. తెలుగులో సూపర్ హిట్టయిన “ఆ నలుగురు” సినిమాతో సహా పలు చిత్రాలు తీసిన చంద్ర సిద్ధార్థ లి రాజేంద్ర ప్రసాద్ స్వయాన సోదరుడు. రాజేంద్ర ప్రసాద్ పుట్టి పెరిగింది హైదారాబాద్‌లోనే.  

మేఘం, హీరో సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మిట్టల్ వర్సెస్ మిట్టల్(2010), ఆగా(2011) లాంటి హిందీ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. చివరిగా ఆయన 2017లో వచ్చిన కాల్ ఫర్ ఫన్ అనే చిత్రానికి డీఓపీగా వర్క్ చేశారు.

తెలుగులో సినిమాటోగ్రాఫర్, దర్శకుడిగా పని చేసిన ఆయన కొన్ని హాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశారు. మ్యాన్ ఉమెన్ అండ్ ది హౌస్, రెస్క్యూ- వేర్ ది ట్రూత్ లైస్, ఆల్ లైట్స్, నో స్టార్స్ లాంటి ఇంగ్లీష్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్నింటికీ ఆయనే సీనిమాటోగ్రఫీ, రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాజేంద్ర ప్రసాద్  మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.