అరకులో అజిత్ 61 షూటింగ్

వాలిమై తర్వాత హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న సినిమా (#AK61) వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా మంజూ వారియర్‌ నటిస్తోంది. తెల్లని పెద్ద గడ్డం లుక్‌లో అజిత్‌ ఇందులో కనిపించనున్నారు.

ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ప్రాంతంలో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అజిత్‌ సహా చిత్రబృందం విశాఖలో అడుగుపెట్టింది. ఒక పెద్ద బైక్‌ రేసింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీయడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అరకులో అభిమానులతో కలిసి దిగిన అజిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.