కొత్తగా 119 గురుకులాలు

కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి మండలానికీ ఒక గురుకులాన్ని పెట్టాలన్నదే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించనున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉండేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేసమయ్యారు. బీసీలు, ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయం అందించే విషయమై చర్చించారు. ఈ సమావేశంలో గురుకుల పాటశాలల పెంపు అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యాసంవత్సరంలోగా నియోజకవర్గానికో గురుకుల పాఠశాల ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.