అమిత్ షా-రామోజీరావు-ఎన్టీఆర్-చంద్రబాబు మీటింగ్ ?
తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భేటీ కాబోతున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అమిత్ షా.. అందులో తారక్ నటనకు ఫిదా అయ్యారు. ఆయన్ని కలవాలని ఆశపడ్డారు. అందుకే మునుగోడు సభను ముగించుకొని తిరిగి ఢిల్లీ వెళ్లే క్రమంలో శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో తారక్ తో అమిత్ షా సమావేశం కానున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఉంటుంది అన్నారు. ఆదివారం సాయంత్రం వరకు వినిపించిన వార్తలు ఇవి. అయితే ఆ తర్వాత స్క్రిప్ట్ మారింది.
అనూహ్యంగా రామోజీరావు రంగ ప్రవేశం చేశారు. కాదు.. కాదు.. రామోజీ ఫిల్మ్ సిటీ కే అమిత్ షా వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. రామోజీతో అమిత్ షా దాదాపు అరగంట సమావేశం అవుతారు. ఇక తారక్ తో కలిసి షా డిన్నర్ చేస్తారనే వార్తలు వచ్చాయి. ఇంకా సమయం గడుస్తున్నా కొద్ది.. వార్తలు పసుపు కలర్ లోకి మారిపోయాయి. అవునూ.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యక్షం అయినట్టు సమాచారం. అమిత్ షా-రామోజీరావు-ఎన్ టీఆర్ – చంద్రబాబు కలిసి డిన్నర్ రాజకీయాలు నడిపినట్టు తెలిసింది.
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. మరీ.. ఇందులోకి ఎన్ టీఆర్ ను ఎందుకు లాగారు ? అంటే.. ఇప్పుడు తెలంగాణ టీడీపీ బతికి లేదు. చచ్చుపడి ఉంది. దాన్ని మళ్లీ లేపాలి అంటే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ఆయన మామ బాలయ్య తరం కూడా కాదు. ఒక్క తారక్ కే అది సాధ్యం. అందుకే టీడీపీ బాధ్యతలు తారక్ కు అప్పగించే ప్రయత్నాలు జరిగాయి. ఒకవేళ అందుకు ఆయన అంగీకరించకుంటే.. కనీసం ప్రచారం అయినా చేయాలనే రిక్వెస్ట్ స్వయంగా అమిత్ షాతో చేయించే ఎత్తుగడ వేశారు. ఆ తర్వాత ఏపీలో తన అవసరాలను తీర్చుకొని.. మరోసారి అధికారంలోకి రావాలనే మాస్టర్ ప్లాన్ చంద్రబాబు బుర్ర నుంచి ఊడిపడినట్టు టాక్.