రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు.. బీజేపీ సంచలన నిర్ణయం
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో ఆ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు.. ఇతర అన్ని రకాల పదవుల నుంచి తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని రాజాసింగ్ ను ప్రశ్నించింది. అంతేకాదు.. సస్పెన్షన్ వేటుపై పది రోజుల్లో వివరణ ఇవాలని కోరింది. సెప్టెంబర్ 2 లోగా వివరణ ఇవ్వాలని ప్రకటనలో పేర్కొంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ తరుపున గెలిచిన ఏకైక వ్యక్తి రాజాసింది. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల రఘునందన్ రావు (దుబ్బాక), ఈటల రాజేందర్ (హుజురాబాద్) చేరారు. ట్రిపుల్ ఆర్ఆర్ఆర్ పిలిపించుకుంటున్నారు. ఇక రాజాసింగ్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవడం వెనుక తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. పార్టీకి ఇబ్బంది తెచ్చిపెట్టడమే కారణంగా తెలుస్తోంది. ఓ వైపు రాజాసింగ్ పై సొంత పార్టీ సస్పెన్షన్ వేటు వేస్తే.. మరోవైపు ఆయన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ లో పెట్టారు.