క్రికెట్‌కు బ్యాడ్ డే.. షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు ఆసక్తిగా తిలకించారు. ఉత్కంఠపోరులో టీమ్‌ఇండియా గెలిచింది. దాయాదుల పోరు మరోసారి మజా పంచింది. అయితే దాయాదుల పోరు తనను ఆకట్టుకోలేదని, ఇరు జట్లూ ఓడిపోవాలని ప్రయత్నించాయని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ‘క్రికెట్‌కు బ్యాడ్ డే’ అంటూ ఓ ట్యాగ్ లైన్ తగిలించాడు.
రిజ్వాన్ 42 బంతుల్లో 43 పరుగులు చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలి ఆరు ఓవర్లలో 19 డాట్ బాల్స్ పడ్డాయి. ఎక్కువ డాట్ బాల్స్ ఆడితే ఇబ్బందుల్లో పడినట్లే. అలానే ఇద్దరు సారథులు తమ జట్టు ఎంపికను సరిగా చేయలేదు. రిషభ్ పంత్‌ను భారత్ పక్కన పెట్టేసింది. పాకిస్థాన్ మాత్రం ఇఫ్తికార్ అహ్మద్‌ను నాలుగో స్థానానికి పంపింది. భారత్, పాక్ జట్లు బ్యాడ్ క్రికెట్‌ను ఆడాయని చెప్పుకొచ్చాడు.