రెండో టీ20.. ఇంగ్లాండ్’దే !

రెండో టీ20 గెలుపుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ని సమం చేసింది ఆదిత్య ఇంగ్లాండ్ జట్టు. శుక్రవారం జరిగిన రెండో టీ20లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. కోహ్లి (47; 38 బంతుల్లో 1×4, 2×6), ధోని (32 నాటౌట్‌; 24 బంతుల్లో 5×4) రాణించారు.

149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు.. హేల్స్‌, (58 నాటౌట్‌; 41 బంతుల్లో 4×4, 3×6) బెయిర్‌స్టో (28; 18 బంతుల్లో 2×6) రాణించడంతో 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఆదివారం చివరి టీ20 మ్యాచ్‌ జరుగుతుంది.

స్కోర్ బోర్డు :

భారత్‌ : 148/5

కోహ్లి 47, రైనా 27, ధోని 32 నాటౌట్‌, పాండ్య 12 నాటౌట్‌; విల్లీ 1/18, బాల్‌ 1/44, ప్లంకెట్‌ 1/17, రషీద్‌ 1/29

ఇంగ్లాండ్‌ : 149/5 (19.4 ఓవర్లలో)

రాయ్‌ 15, బట్లర్‌ 14, హేల్స్‌ 58 నాటౌట్‌, బెయిర్‌స్టో 28; ఉమేశ్‌ 2/36, కుల్‌దీప్‌ 0/34, చాహల్‌ 1/28