బ్రహ్మాస్త్ర బడ్జెట్‌ రూ. 410 కోట్లు ! ప్లాప్ అయితే పరిస్థితి ఏంటీ ?

ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఏం బాగులేదు. ఈ హీరో, ఆ హీరో అనే తేడా ఏం లేదు. స్టార్ హీరోలు ఎంత శ్రమించినా హిట్ దక్కడం లేదు. సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ నెల 9న బ్రహ్మాస్త్ర ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ – అలియా భట్ జంటగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ తదితరులు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది.

ఈ సినిమా కోసం దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రింట్‌, పబ్లిసిటీ ఖర్చులు కాకుండానే సినిమా నిర్మాణానికి రూ.410 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ వచ్చిన హయ్యెస్ట్‌ బడ్జెట్‌ మూవీ ఇది. ఆ బడ్జెట్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమాను నిర్మించాలనే ఇంత భారీ బడ్జెట్‌తో తీశారు. అయాన్‌. అయితే ఇంతటి భారీ బడ్జెట్ మూవీ ప్లాప్ అయితే ఏంటీ పరిస్థితి ? అన్న బెంగ బాలీవుడ్ కు పట్టుకుంది. మరీ.. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.