‘బ్రహ్మాస్త్ర’ ప్రోమో.. మరో లెవెల్ !

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1 : శివ’. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు అంచనాలను పెంచాయి. తాజాగా విడుదల చేసిన ప్రీ రిలీజ్‌ ప్రోమో చేరేలా మరో లెవల్ అన్నట్టుగా ఉంది. ట్రైలర్‌లో లేనివి, సినిమాలో కీలకంగా నిలిచే కొన్ని సీన్స్‌ని ఇందులో చూపించారు.

ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రాలకు సంబంధించి పురాణ గాథలు, వాటి శక్తిని గురించి తెలియజేయనున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌-అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

#Brahmastra PRE-RELEASE PROMO. pic.twitter.com/TWI4PRNXOE— OTTRelease (@ott_release) September 3, 2022