వన్వర్డ్ ట్రెండ్ : మాన్స్టర్-వైలెంట్, తగ్గేదే లే-వస్తున్నా
ప్రస్తుతం ట్విటర్లో వన్ వర్డ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే.. ఎవరైనా నెటిజన్ కేవలం ఒకే ఒక్క పదాన్ని ట్వీట్ చేయాలన్నమాట. ఇప్పుడీ.. ఈ ఫీవర్ టాలీవుడ్ కు పట్టుకుంది. నరాచీ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకొని, పవర్ని చూపించిన తమ హీరో రాఖీబాయ్ని ‘మాన్స్టర్’గా పేర్కొంటూ ‘కేజీయఫ్ – 2’ టీమ్ శనివారం ఉదయం ఓ ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ వచ్చిన కొన్ని సెకన్లలోనే ప్రభాస్ హీరోగా సిద్ధమవుతున్న‘సలార్’ ట్విటర్ పేజీ నుంచి ‘వైలెంట్’ అంటూ ఓ పోస్ట్ వచ్చింది.
ఇక మధ్యాహ్నం కల్లా అల్లు అర్జున్, ఎన్ టీఆర్ రంగంలోకి దిగిపోయారు. ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ముందుకు వచ్చింది. ‘పుష్ప – ది రైజ్’ ఖాతా నుంచి ‘ఫైర్’ అంటూ పోస్ట్ వెలువడింది. #NTR30 నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ నుంచి ‘వస్తున్నా’ అంటూ ట్వీట్ వచ్చింది. దీంతో వన్ వర్డ్ ట్వీట్ లోనూ స్టార్ హీరోలు దమ్ము చూపించినట్టు అయింది.