వైరల్ : రణ్ బీర్-అలియా రొమాంటిక్ పిక్స్

బాలీవుడ్ లో ప్రేమజంట రణ్ బీర్ కపూర్-అలియా భట్ అడ్డంగా దొరికిపోయారు. వీరు అర్థరాత్రి ఏకంతగా రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది నిజమే అన్నట్టు.. ‘నేనెప్పుడు సింగిల్‌గా ఉండను. ఇప్పుడూ అంతే’ రణ్ బీర్ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం రణ్ బీర్ ‘సంజు’ హిట్ కిక్కులో ఉన్నాడు. ఇందులో సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ ఒదిగిపోయిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఐతే, ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రణ్ బీర్ అలియా ఇంట్లో పార్టీ చేసుకొన్నాడు. ఈ పార్టీలో అలియా తండ్రి మహేష్‌ భట్‌ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో అలియా-రణ్ బీర్ మాట్లాడుతూ కనిపించిన ఫోటోలవి అని చెబుతున్నారు. అవి కాస్త రొమాంటిక్ గా అనిపించడంతో.. బాలీవుడ్ మీడియా వాటిని హైలైట్ చేస్తూ కథనాలు రాశాయి.

గతంలో రణ్ బీర్ చాలానే ప్రేమ వ్యవహారాలు నడిపారు. దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లతో ఎఫైర్ నడిపాడు. రణ్ బీర్ – కత్రినా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కత్రినా తో కటీఫ్ అయిన తర్వాత రణ్ బీర్ అలియాతో మొదలెట్టాడు. అలియా కూడా అంతకు ముందు యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేసింది.