దేవిశ్రీ సీక్రెట్ మ్యారేజ్.. క్లారిటీ ఇచ్చింది !
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి నటి పూజిత పొన్నాడ పేరు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె దేవిశ్రీ ని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై పూజిత స్పందించారు. తాను ఎవరితోనూ రిలేషన్లో లేనని చెప్పుకొచ్చారు.
“దేవిశ్రీతో రిలేషన్లో ఉన్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం. అసలు ఆ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామని అంటున్నారు. అది నిజం కాదు. ఆయనతోనే కాదు.. ఎవరితోనూ రిలేషన్లో లేను. ప్రస్తుతానికి నేను సింగిల్” అని స్టేట్ మెంట్ ఇచ్చింది. విశాఖకు చెందిన పూజిత ‘ఊపిరి’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఆకాశ వీధుల్లో’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.