‘విక్రమ్ వేద’ ట్రైలర్ ఎప్పుడంటే ?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్ వేద’. తమిళ్ హిట్ ‘విక్రమ్ వేద’కి రిమేక్ ఇది. పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, రాధిక ఆప్టే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 30న విక్రమ్ వేద ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ ఫోకస్ పెట్టింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

ఈ నెల 8న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్ ను షేర్ చేసింది. ఇందులో హృతిక్, సైఫ్ ఇద్దరూ యాక్షన్ మూడ్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ మరియు వై నాట్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. మాతృక ను మించి యాక్షన్ అదిరిపోనుందని చెబుతున్నారు.