#Brahmastra మేకింగ్ చూశారా ?

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ బ్రహ్మాస్త్ర. రణ్ బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెల 9న బ్రహ్మాస్త్ర ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్ రోజుకో వీడియోను వదులుతోంది. నిన్న ప్రీ రిలీజ్ ప్రోమోను రిలీజ్ చేశారు. తాజాగా బ్రహ్మాస్త్ర మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.  యాక్షన్ సీన్స్ కు సంబంధించిన ఈ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా కోసం దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రింట్‌, పబ్లిసిటీ ఖర్చులు కాకుండానే సినిమా నిర్మాణానికి రూ.410 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ వచ్చిన హయ్యెస్ట్‌ బడ్జెట్‌ మూవీ ఇది. ఆ బడ్జెట్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమాను నిర్మించాలనే ఇంత భారీ బడ్జెట్‌తో తీశారు. అయితే బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మాస్త్ర ఏ మేరకు కలెక్ట్ చేస్తుంది ? అన్నది ఆసక్తిగా మారింది. 

In just 5 days, the story of ancient Indian astras comes alive on the big screens! 💥#Brahmastra in cinemas from 9th September.
Tickets available in 2D, 3D and IMAX 3D. Book now!
BMS- https://t.co/qjPVPFw8u1
Paytm – https://t.co/eVmK21MLmv pic.twitter.com/kulM5dTHV8— BRAHMĀSTRA (@BrahmastraFilm) September 4, 2022