భారీ బడ్జెట్ తో చైతూ తొలి తమిళ సినిమా
లాల్ సింగ్ చడ్డా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో చైతూ నిరాశచెందక తప్పలేదు. ఇప్పుడు నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందనుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక.
ఈ నెల మూడో వారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇది చైతూకి తొలి తమిళ సినిమా కాగా.. దర్శకుడు వెంకట్‌కు తొలి తెలుగు చిత్రం. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. అబ్బూరి రవి సంభాషణలు అందిస్తున్నారు. ఇందులో నాగచైతన్య మునుపెన్నడూ చేయని పాత్ర పోషిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది.