‘ప్రాజెక్ట్ కె’ కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్లు !

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్‌  సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. అమితాబ్‌ బచ్చన్‌  కీలకపాత్ర పోషిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సుదీర్ఘమైన అయిదు యాక్షన్‌ బ్లాకులు ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలిసింది.

ఈ యాక్షన్ సీన్స్ చిత్రీకరించడానికి, నాలుగు వేర్వేరు యూనిట్లను నిర్మించనున్నారట. వీటిని రూపొందించడానికి నలుగురు హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్లను ఈ చిత్ర యూనిట్ రంగంలోకి దించనుంది. మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘ప్రాజెక్ట్ కె’ ను తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారట. వైజయంతి మూవీస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది.