ఇది రాజమౌళి స్టోరీ కాదే

కథను చెప్పే విధానంలో నాకంటూ ప్రత్యేకశైలి ఉంది. దాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. అంతేకానీ, పూర్తిగా నా శైలిని మార్చుకుని సినిమాలు తీయకూడదు. అలా తీస్తే సినిమా హిట్ కాదు అన్నారు దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళి ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

హాలీవుడ్‌ ప్రేక్షకులకు నా సినిమాలు నచ్చుతున్నాయి కదాని, నా ఆలోచన ధోరణి మార్చుకుని, నేను కూడా అలా సినిమాలు తీస్తే, అది సరిగా వర్కవుట్‌ కాకపోవచ్చు. ఎన్ని రకాల మార్పులు, అదనపు హంగులు జోడించినా, అంతిమంగా అది కచ్చితంగా నా స్టోరీ అయి ఉండాలి. ‘ఇది రాజమౌళి స్టోరీ కాదే’ అనిపించకూడదు అన్నారు. రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉండనుంది. ఇదో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయినవి. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.