1140 ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు తెలంగాణ ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య కళాశాలల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)లోనూ వైద్యుల కొరత తీర్చేందుకు మరో పది రోజుల్లో వెయ్యి మంది వైద్యులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 30 టీచింగ్ ఆస్పత్రులకు చెందిన వైద్యులు, నర్సులకు నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్ మాట్లాడారు. ‘బోధనా ఆస్పత్రుల్లో దాదాపు 1,140 అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు వచ్చే రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. రెండు నుంచి మూడు నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.