ఆదిపురుష్ #disappointed

రాముడిగా బాహుబలి ప్రభాస్‌ ఎలా ఉంటాడు? ఎలాంటి సంభాషణలు చెబుతాడు ? ఆదిపురుష్ ప్రకటన తర్వాత వెలువడగానే సినీ అభిమానుల్లో ఉత్పన్నమైన సందేహాలివి. ఆదివారం విడుదలైన టీజర్‌ అన్ని ప్రశ్నలకు  చెక్‌ పెట్టింది. ప్రభాస్‌ ఆహార్యం, మాటలకు భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఫిదా అయింది. రామ నామం జపిస్తోంది. మరోవైపు నెగటివ్ టాక్ కూడా వినిపిస్తుంది. టీజర్ ఆశించిన స్థాయిలో లేదు. యానిమేషన్ సినిమాల ఉందని కొందరు పెదవి విరుస్తున్నారు.

రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతిసనన్ పాత్ర మినహా మిగతా క్యారెక్టర్స్ అన్నీ యానిమేషన్ లో చేసినట్టు టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్, సైఫ్ పాత్రలు కూడా అవతార్ తరహా కాస్టిమ్యూస్ కనిపించాయి. దీంతో నేచరుల్ ఫేవర్ మిస్ అయింది. ఆదిపురుష్ టీజర్ డిసప్పాయింట్ చేసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దిపురుష్ #disappointed అనే యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టీజర్ చూసి.. సినిమా ఫలితాన్ని అంచనా వేయలేమని ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటున్నారు.