ఈ ఏడాది నిశ్చితార్థం ! వచ్చే ఏడాది పెళ్లి ?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రేమలో ఉన్నట్టు చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరు కలిసి నటించిన తొలి సినిమా గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రెండో సినిమా డియర్ కామ్రెడ్ ప్లాప్ అయింది. అయితే హిట్ – ప్లాప్ తో సంబంధం లేకుండా వీరి లవ్ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టు టాక్. విజయ్ కోసం రష్మిక ముంబై వెళ్లిన సందర్భాలున్నాయి. ఇక ఈ జంట ప్రస్తుతం మాల్దీవుల్లో విహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేమ, పెళ్లి గురించి సరికొత్త ప్రచారానికి తెరలేసింది.
రెండు కుటుంబాలూ వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని.. ఇప్పుడు ఈ మేటర్ నిశ్చితార్థం వరకూ వెళ్లిందని సమాచారం. ఈ యేడాదే విజయ్-రష్మికల నిశ్చితార్థం జరగబోతోందని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడానికి ఫిక్సయ్యారని తెలుస్తోంది. విజయ్ కి ఇదివరకు ఓ లవ్ మేటర్ ఉంది. రష్మిక కూడా ఒకర్ని ప్రేమించి… సెండాఫ్ చెప్పి వచ్చేసింది. ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలు మర్చిపోయి.. ఈ జంట ఫ్రెష్ గా లవ్ లో పడింది. ఆ ప్రేమను పెళ్లి పీటల దాకా చేరేలా కనిపిస్తుందని సమాచారం.